: క్షిపణులతో చైనాను చుట్టుముట్టేస్తాం: హిల్లరీ క్లింటన్ రహస్య టేపులు వికీ'లీక్స్'!


అమెరికా విదేశీ మంత్రిగా పనిచేసిన హిల్లరీ క్లింటన్ వైఖరిని వెల్లడిస్తూ వికీలీక్స్ రహస్య పత్రాలను బట్టబయలు చేసింది. వికీలీక్స్ వెల్లడించిన వివరాల్లోకి వెళ్తే... ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలను చైనా నిలువరించకపోతే, ఆ దేశాన్ని తమ క్షిపణి రక్షణ వ్యవస్థతో చుట్టుముట్టేస్తామని హిల్లరీ క్లింటన్‌ 2013లో ప్రైవేటుగా ఇచ్చిన ఉపన్యాసంలో పేర్కొన్నారు. ఉత్తర కొరియా విజయవంతంగా బాలిస్టిక్‌ క్షిపణులను గనుక పొందితే, పసిఫిక్‌ తీర ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలకు ముప్పుగా పరిణమిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దానికంటే ప్రమాదకరమైన అంశం ఏంటంటే... ఆ క్షిపణులు అమెరికా పశ్చిమ తీరమైన హవాయ్‌ ద్వీపకల్పాన్ని ఢీకొట్టగలవు. ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా ఉండాలంటే కొరియాకు అన్ని విధాలుగా మద్దతు పలుకుతున్న చైనాను నియంత్రించాలి. అందుకే తాము చైనాను క్షిపణి రక్షణ వ్యవస్థతో చుట్టుముట్టబోతున్నామని ఆ సంభాషణలో పేర్కొన్నారు. 'చైనా సరిహద్దుల్లోని తమ మిత్రదేశాల్లో మరింత నౌకాదళాన్ని మోహరించడం ద్వారా నువ్వు వారిని (ఉత్తరకొరియా)ను నియంత్రించు. లేని పక్షంలో మేము వారికి వ్యతిరేకంగా రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని ఆమె ఆ రహస్య సంభాషణలో అన్నట్టు వికీలీక్స్ తెలిపింది. దీనిపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News