: ‘మెగా ఆక్వాఫుడ్’ గ్రామాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్
పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం మండలం తుందుర్రు, బేతపూడి, జొన్నలగరువుల్లో మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ గ్రామాలవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. వారిని పరామర్శించి, వారి బాధలను తెలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మీడియాకు తెలిపారు. తమ పార్టీ అధినేత ఈ నెల 19న జిల్లాలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. ఆందోళనల కారణంగా అక్కడి పలు గ్రామాల్లో రాష్ట్ర సర్కారు 144 సెక్షన్ విధించింది.