: భారత్-రష్యా మధ్య పది కీలక ఒప్పందాలు.. రష్యాతో ఏపీ రెండు అవగాహన ఒప్పందాలు


గోవాలో రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న‌ బ్రిక్స్ స‌మాఖ్య‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సదస్సు కోసం వ‌చ్చిన‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ భేటీ అయ్యారు. ర‌ష్యా, భార‌త్‌ ద్వైపాక్షిక అంశాల‌పై చర్చలు జ‌రిపారు. అనంత‌రం భార‌త్-ర‌ష్యా మ‌ధ్య ఇరు దేశాల అగ్ర నేతల సమక్షంలో 10 కీల‌క ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, రష్యా మధ్య ప‌లు ఒప్పందాలు జ‌రిగాయి. ఏపీ ఆర్థిక అభివృద్ధి మండ‌లి-రష్యా మ‌ధ్య ఒప్పందం జ‌రిగింది. అంతేగాక, రెండు అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈడీబీతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ త‌ర‌ఫున ర‌ష్యాతో అవ‌గాహ‌న ఒప్పందంపై ఏపీ అధికారి జాస్తి కృష్ణ సంత‌కం చేశారు. ఏపీలో ర‌వాణా, నౌక నిర్మాణ రంగాల‌పై అవ‌గాహ‌న ఒప్పందం కుదిరింది. భారత్ లో ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాల అభివృద్ధిలో ర‌ష్యా స‌హ‌కారం అందించనుంది. నాగ‌పూర్- సికింద్రాబాద్ మ‌ధ్య హై స్పీడ్ రైళ్ల‌పై ర‌ష్యాతో ఒప్పందం కుదిరింది. హ‌ర్యానా అధికారి తమ రాష్ట్రంలో స్మార్ట్ సిటీల ఏర్పాటుకు రష్యాతో ఒప్పందం చేసుకున్నారు. గ్యాస్ పైప్ లైన్లు, ఎడ్యుకేష‌న్‌, విద్యుత్తు రంగాలపై ప‌లు రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్నాయి.

  • Loading...

More Telugu News