: బాగ్ అంబర్ పేట శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిపై దాడి చేసిన తోటి విద్యార్థులు.. పరిస్థితి విషమం.. ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని బాగ్ అంబర్ పేట శ్రీ చైతన్య కాలేజీ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న ఆ కాలేజీ విద్యార్థి విజయ్‌వర్థన్‌పై అదే కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా దాడి చేశారు. ప్రస్తుతం విజయవర్థన్ హైదర్‌గూడ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే, ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు తెల్లవారు జామున ఆసుపత్రిలో సదరు విద్యార్థికి వైద్యులు ఆపరేషన్ చేశారు. ఈ రోజు శ్రీ చైతన్య కాలేజీకి సెలవు ప్రకటించారు. యాజమాన్యం తీరుకి నిరసనగా విద్యార్థి విజయ్‌వర్థన్ బంధువులు, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. గాయపడ్డ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాలేజీ ముందు ఉద్రిక్తత నెలకొంది. కాగా, దాడి చేసిన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరిని తప్పించాలని పోలీసులపై పలువురు ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు సమాచారం.