: 2019లో రేవంత్ రెడ్డి పోటీ ఎక్కడ నుంచి?


తెలంగాణలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు పూర్తయింది. రానున్న రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. డీలిమిటేషన్ తో అనేక కొత్త నియోజకర్గాలు పుట్టుకొస్తాయి. అంతేకాదు, రిజర్వేషన్లు కూడా మారిపోతాయి. ప్రస్తుతం ఉన్న జనరల్ కేటగిరీ నియోజకవర్గాలు రిజర్వుడు కేటగిరీ కిందకు వెళ్లిపోవచ్చు. ఈ నేపథ్యంలో, పలువురు రాజకీయ నేతలకు స్థాన చలనం తప్పదు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. డీలిమిటేషన్ జరిగితే, కొడంగల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో, 2019 ఎన్నికల్లో ఆయన తాండూరు నుంచి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, తన అత్తగారి ఊరు మాడుగుల రంగారెడ్డి జిల్లాలో ఉండటంతో... ఆయన రంగారెడ్డి జిల్లా నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నయని సమాచారం.

  • Loading...

More Telugu News