: అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో టీ-బ్రిడ్జిని ప్రారంభించిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌


తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అమెరికా పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తున్నారు. ఉబెర్‌ కేంద్ర కార్యాలయంలో ప‌లువురు అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం సిలికాన్‌ వ్యాలీలో టీ-బ్రిడ్జిని ప్రారంభించి దాని గురించి వివరించారు. ఉబర్, టై సిలికాన్ వ్యాలీతో కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్‌ను ప్రపంచంలోని 10 స్టార్టప్ నగరాల్లో ఒకటిగా నిలుపుతామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో స్టార్టప్ నిర్వహణకు మంచి వాతావ‌ర‌ణం ఉందని ఉబర్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షులు రేచల్ వెట్ స్టోన్ అన్నారు. ఇండియాలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తోంద‌ని ఆయ‌న కొనియాడారు.

  • Loading...

More Telugu News