: వయసు మీద పడుతోంది.. వినిపించడం లేదు, కనిపించడం లేదు.. ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వయసు మీద పడుతోందని, ముసలి వాడిని అయిపోతున్నానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా ఒహియోలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా పై వ్యాఖ్యలు చేశారు. హిలర్లీ క్లింటన్‌కు ఓటు వేయాలని కోరారు. ఈ సమయంలో కొందరు నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఓ మహిళ ఒబామాను ఉద్దేశించి ‘మాకు పైప్‌లైన్ వద్దు’ అంటూ గట్టిగా అరించింది. దీంతో కల్పించుకున్న అధ్యక్షుడు ‘‘నేను ముసలి వాణ్ని అయిపోతున్నా. మీరేం మాట్లాడుతున్నారో నాకు వినిపించడం లేదు. మీరెవరో నాకు సరిగా కనిపించడం లేదు. మీకేదైనా సమస్య ఉంటే నాకు రాయండి. పరిష్కరిస్తా’’ అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News