: జైపూర్లో హైడ్రామా!
జైపూర్లో ఈ సాయంత్రం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో హైడ్రామా నడిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విసిరిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ కు ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విజయానికి 6 పరుగులు అవసరం అయ్యాయి. బెంగళూరు బౌలర్ వినయ్ కుమార్ విసిరిన ఆ ఓవర్లో తొలి మూడు బంతులు ముగిసేసరికి రెండు వికెట్లు పతనం అయ్యాయి. ఇక 3 బంతుల్లో 4 పరుగులు అవసరం కాగా, ఐదో బంతికి స్టూవర్ట్ బిన్నీ ఫోర్ కొట్టడంతో రాజస్థాన్ శిబిరంలో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. దీంతో మరో బంతి మిగిలుండగానే రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి విజయభేరి మోగించింది.