: మీ కార్యక్రమానికి రాను...ట్రంప్ కి మద్దతివ్వను: ఇలియానా
అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతివ్వనని ప్రముఖ సినీ నటి ఇలియానా డిక్రూజ్ తెలిపింది. రేపు (అక్టోబర్ 15న) అమెరికాలోని న్యూజెర్సీలోని పీఎన్సీ ఆర్ట్ సెంటర్ లో ‘హ్యూమానిటీ యునైటెడ్ అగైనెస్ట్ టెర్రర్’ అనే చారిటీ కార్యక్రమం జరగనుంది. ఉగ్రవాద బాధితులకు విరాళాలు సేకరించడానికి రిపబ్లికన్ హిందూ కోలిషన్ (ఆర్ హెచ్ సీ) నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించింది. ఇందులో పాల్గొనేందుకు రాంచరణ్ వంటి సినీ నటులు పలువురు అంగీకరించారు. అయితే ఇలియానా మాత్రం అంగీకరించలేదు. అంతే కాకుండా ట్రంప్ కి సపోర్ట్ చేయనని స్పష్టంగా చెప్పింది. అమెరికాలో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. వారందర్నీ ఆకట్టుకునేందుకు, విరాళాలు సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఆర్.హెచ్.సీ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వీరందరితోపాటు ట్రంప్ కూడా పాల్గొననున్నాడు.