: విశాఖ బీచ్ రోడ్డుకు వెళ్లిన నవజంటను వేధించిన ఆకతాయిలు... కటకటాల వెనక్కు ఆరుగురు మైనర్లు!


కొత్తగా పెళ్లయిన ఓ జంట కాసేపు సరదాగా గడిపేందుకు తమ బైక్ పై విశాఖ బీచ్ కు వెళ్లిన వేళ, ఆకతాయిల బారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, బీచ్ రోడ్డు నుంచి సిరిపురం జంక్షన్ వరకూ కామెంట్లు చేస్తూ, తమ బైక్ లతో ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తూ, నవదంపతులను వెంబడించిన ఆరుగురు మైనర్లు.. ఆపై బైకులు అడ్డంగా పెట్టి వారిని వేధించారు. భర్తను కొట్టి, భార్య చేతులు లాగుతూ, తాకరాని చోట్ల తాకుతూ వేధించారు. మూడు బైకులపై వచ్చిన ఆకతాయిలు చేస్తున్న గొడవను గమనించిన స్థానికులు చేరుకునే సరికి వారంతా పారిపోగా, ఒకడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతన్ని విచారించిన పోలీసులు మిగతా వారిని కూడా అరెస్ట్ చేశారు. వీరంతా మైనర్లేనని, వీరి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కేసులు బుక్ చేయనున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News