: లష్కరే తోయిబాపై పాక్ చర్యలు తీసుకోవాల్సిందే: తేల్చిచెప్పిన అమెరికా


ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాపై పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్యా శాంతిపూర్వక విధానంతో సమస్యలు పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమని వైట్ హౌస్ ఉప ప్రతినిధి మార్క్ టోనర్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్ నుంచి ఉగ్రవాదులపై వ్యతిరేకత తమకు కనిపించాలని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్యా మరింత శాంతి నెలకొనాలని అమెరికా కోరుకుంటోందని, భద్రతా అంశాలు సహా, సరిహద్దుల వరకూ ఎలాంటి ఉద్రిక్తత ఉండకుండా ఉండాలని, ఇరు దేశాలూ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఉగ్రవాద మూలాలు పాక్ లో ఉన్నంత కాలం ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగవని అభిప్రాయపడ్డ ఆయన, తమ వైఖరిపై పాకిస్థాన్ స్పష్టత ప్రపంచ దేశాలకు తెలియాల్సివుందని టోనర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News