: ధర్మసాగర్ చెరువులో చేపపిల్లలను వదిలిన మంత్రి తలసాని


తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ ఈ రోజు వ‌రంగ‌ల్ అర్బ‌న్ ప్రాంతంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇటీవ‌లే కురిసిన భారీ వ‌ర్షాల‌కు నిండిన ధ‌ర్మ‌సాగ‌ర్ చెరువులో చేప‌పిల్ల‌ల‌ను వ‌దిలారు. ఆయ‌న‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు కూడా చేప‌పిల్ల‌ల‌ను చెరువులో వ‌దిలి చేప‌ల వ్యాపారం లాభ‌సాటిగా సాగాల‌ని ఆకాంక్షించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్ర‌మంలో త‌ల‌సాని మాట్లాడుతూ... చేప‌ల పెంప‌కం లాంటి ఉపాధి ప‌నుల‌పై దృష్టి పెట్టాల‌ని, ప్ర‌భుత్వం అందిస్తోన్న సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు.

  • Loading...

More Telugu News