: కావాలని ఓడిపోయిన టెన్నిస్ స్టార్ కిర్గియోస్ కు భారీ జరిమానా


షాంఘై మాస్టర్స్ టెన్నిస్ పోటీల్లో కావాలని ఓడిపోయిన ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ పై ఏటీపీ (అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్) కఠిన చర్యలు తీసుకుంది. వరల్డ్ ర్యాంకింగ్స్ లో 14వ స్థానంలో ఉన్న కిర్గియోస్, తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేదని, ఓ అభిమానిని తిట్టాడన్న కారణాలు చూపి 16,500 డాలర్లు (సుమారు రూ. 11 లక్షలు) జరిమానాగా విధించింది. రెండో రౌండ్ మ్యాచ్ ఆడుతున్న కిర్గియోస్, జర్మనీ ఆటగాడు మిస్కా జ్వెరేవ్ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, కావాలనే ఓడిపోయానని చెప్పుకున్నాడు. ఆపై ఏటీపీ అధికారులు వివరణ కోరగా, పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో అతనిపై జరిమానా విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News