: తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో కదలిక.. కీలక ఫైళ్లు పరుగులు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నాటినుంచి దాదాపు స్తంభించిన ప్రభుత్వ కార్యకలాపాల్లో గురువారం కదలిక వచ్చింది. జయ ఆస్పత్రిలో చేరాక కార్యకర్తల నుంచి మంత్రుల వరకు ఆస్పత్రి వద్దే ఉంటూ వస్తుండడంతో గత 23 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించి పోయాయి. అయితే గురువారం మాత్రం ప్రభుత్వ కార్యకలాపాల్లో కొంత కదలిక కనిపించింది. పలువురు మంత్రులు, అధికారులు సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు. సీఎం శాఖలకు సంబంధించిన కీలక ఫైళ్లను ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం పరిశీలిస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారుల నియామకం, బదిలీలు, పోలీసు శాఖలో పదోన్నతులకు సంబంధించిన ఫైళ్లు గురువారం చకచకా కదిలాయి.