: రక్షణ మంత్రి పారికర్ సైన్యాన్ని, దేశాన్ని అవమానించారు: ఏకే ఆంటోనీ


రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇండియన్ ఆర్మీని, దేశాన్ని అవమానించారని మాజీ రక్షణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి పారికర్ సర్జికల్ స్ట్రయిక్స్ క్రెడిట్ మొత్తం ప్రధాని మోదీకి చెందుతుందని వ్యాఖ్యానించడం ద్వారా సైన్యాన్ని, దేశాన్ని అవమానించారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మెరుపుదాడులు జరగలేదని ఆయన చెప్పడాన్ని ఆంటోనీ ఖండించారు. పారికర్‌ ను ఎవరైనా నియంత్రించాలని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని పేర్కొన్న ఆయన, పారికర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News