: భారతీయ పురుషుల గురించి పాకిస్థాన్ యువతి ఏం చెప్పిందో చూడండి!


పాకిస్థాన్ లోని ఓ రియాలిటీ షోలో ఆ దేశ పురుషులపై ఓ యువతి సంచలన వ్యాఖ్యలు చేసింది. 'సబ్ సే హిమ్మత్ వాలా'గా పేర్కొన్న ఆ షోలో వ్యాఖ్యాత "ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన పురుషులు అందరికంటే ఉత్తమమైన వారు? అని మీరు భావిస్తున్నారు" అని అడిగాడు. దీనికి ఆ యువతి సమాధానం చెబుతూ... "ప్రపంచంలోని అందరికంటే భారతీయ పరుషులు ఉత్తమమైన వారు" అని సమాధానం చెప్పింది. దీంతో వ్యాఖ్యాతకు ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. ఎందుకలా భావిస్తున్నారని మళ్లీ ప్రశ్నించాడు. దానికి సూటిగా సమాధానమిచ్చిన ఆ యువతి "విమానమెక్కే పాకిస్థానీలు పెద్దతాగుబోతుల"ని చెప్పింది. ప్రధానంగా రంజాన్, మొహర్రం సీజన్ లో విమానంలో ఉచితంగా మద్యం ఇస్తారని తాగేస్తారని, అలా తాగేసిన తరువాత విమానంలో ఒకటే హడావుడి చేస్తారని, విమానం తమదే అన్నట్టు ప్రవర్తిస్తారని, అరుస్తారని, చిందులేస్తారని, అసభ్యంగా ప్రవర్తిస్తారని చెప్పింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ షో నిర్వాహకుడు 'మరి భారతీయులు?' అని ప్రశ్నించాడు... "భారతీయులు విమానంలో చాలా హుందాగా నడుచుకుంటారు. కొంత మంది తాగినా మౌనంగా తమ సీట్లో నిద్రపోతారు" అని తెలిపింది. "ఆ దేశంలో కూడా మహిళల పట్ల చాలా మర్యాదగా నడుచుకుంటార"ని తెలిపింది. దీంతో ఆగ్రహాన్ని నిభాయించుకున్న నిర్వాహకుడు "మరి పాశ్చాత్య దేశాల మహిళలు కూడా మందు తాగుతారు కదా?" అని ప్రశ్నించాడు. దీనికి ఆమె సమాధానమిస్తూ... "వారికి కేవలం విమానాల్లోనే తాగాలన్న ఆలోచన ఉండదని, ఉచితంగా వచ్చింది కదా అని ఎంతపడితే అంత తాగర"ని తెలిపింది. ఈ వీడియోను 56,000 మంది వీక్షించడం విశేషం. ఆ వీడియోను మీరు కూడా వీక్షించండి.

  • Loading...

More Telugu News