: గోప్యంగా ఉంచాల్సిన విషయం చంద్రబాబుకి ఎలా తెలిసింది?.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి ఉండవల్లి లేఖ
నల్లధనంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ఈ రోజు వైసీపీ అధినేత జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా లేఖ రాశారు. ఆదాయ వెల్లడి పథకంపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను లేఖలో ఉండవల్లి పేర్కొన్నారు. రూ.10 వేల కోట్లను చట్టబద్ధం చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. తనకు తెలిసిందని చంద్రబాబు నాయుడు ఎలా ప్రచారం చేసుకుంటారని ఆయన అన్నారు. గోప్యంగా ఉంచాల్సిన ఈ అంశంపై ఆర్థిక శాఖ చంద్రబాబుకి అధికారికంగా సమాచారం ఇచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఇవ్వకపోతే బాబు తనకు ఇష్టం వచ్చినట్లు ఎలా వ్యాఖ్యలు చేస్తారని ఆయన అడిగారు. ఈ సమాచారం కొందరికి ఎలా తెలుస్తోందని ఆయన నిలదీశారు.