: ఈ శివలింగం కదులుతుంది... శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని రహస్యం!


ఉత్తరప్రదేశ్‌‌ లోని రుద్రపూర్‌ లో దుగ్దేశ్వరనాథ్ శివాలయంలోని స్వయంభూ శివలింగం శాస్త్రవేత్తలకు సవాలు విసురుతోంది. సాధారణంగా భారత్ లో ప్రతిష్ఠించే శివలింగాలు పానమట్టం మీద ఉంటాయి. ఈ రుద్రపూర్‌ లో వెలసిన శివలింగం మాత్రం స్వయంభూ శివలింగం. ఇది భూమిలోపలికి ఉంటుంది. ఆలయంలో శివలింగం స్వయంభూగా (తనంతట తానే ఉద్భవించినది) ఏర్పడగా, ఇది కదులుతూ ఉంటోంది. ఈ కదలిక ఒకసారి కాదు... చాలా సార్లు కదులుతుందట! ఈ కదలిక "గంటసేపు కావచ్చు, రెండు గంటలసేపు కావచ్చు లేదా పూర్తిగా ఒకరోజైనా కావచ్చు" అని దేవాలయ పూజారులు చెబుతున్నారు. ఇలా శివలింగంలో కదలిక ప్రారంభమైతే ఆలయానికి భక్తులు పోెటెత్తుతారని వారు చెబుతున్నారు. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఎన్నోసార్లు ప్రయత్నించినా విఫలమయ్యారట. ఇలా లాభం లేదని శివలింగం కింద తవ్వినా ఎలాంటి ఫలితం లేదట... ఎంత తవ్వినా రాయే రావడంతో దానికింద ఏ అద్భుతం ఉందన్నది అంతుబట్టడం లేదని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News