: సహనటుల పట్ల ఆకర్షితురాలినవ్వలేదు: సోనమ్ కపూర్
సహనటుల పట్ల తానెప్పుడూ ఆకర్షణకు లోనవ్వలేదని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపింది. సావన్ మ్యూజిక్ యాప్ కోసం నేహాధూపియా నిర్వహిస్తున్న షోలో పాల్గొన్న సోనమ్ బోల్డ్ గా పలు విషయాలు చెప్పింది. తాను సహనటులతో 24 గంటలు సినిమాల గురించి మాట్లాడలేనని తెలిపింది. అందుకే తానెవరి పట్ల ఆకర్షితురాలిని కాలేదని, అందుకే వారితో శృంగారంలో పాల్గొనలేదని చెప్పింది. శృంగారం అంటే ఇష్టమే కానీ సహనటులతో శృంగారంలో పాల్గొనలేదని తెలిపింది. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉన్నానని తెలిపింది. సహనటులు బాగుంటారని చెప్పింది. అయితే వారితో శృంగారంలో పాల్గొనలేదు కనుకే వారితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని సరికొత్తగా సూత్రీకరించింది. తన తమ్ముడు హర్షవర్థన్ కపూర్ గురించి ఆందోళన చెందుతున్నాని తెలిపింది.