: శంషాబాద్ విమానాశ్రయంలో రియాద్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఓ విమానం కొద్ది సేపటికే మళ్లీ అదే ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. సాంకేతిక కారణాల వల్లే విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని విమానాశ్రయ అధికారులు మీడియాకు తెలిపారు. సదరు విమానం రియాద్ బయలుదేరిన ఏవీ 753 గా అధికారులు పేర్కొన్నారు.