: ‘డిమాండ్ నెరవేర్చేవరకు దిగబోము’.. మంచిర్యాలలో నీటి ట్యాంక్‌పైకి ఎక్కి న‌లుగురు యువ‌కుల ఆందోళ‌న


ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలలో ఈ రోజు ఆందోళనకర వాతావ‌ర‌ణం నెల‌కొంది. న‌లుగురు యువ‌కులు నీటి ట్యాంక్‌పైకి ఎక్కారు. త‌మ డిమాండ్‌ను ప‌రిష్క‌రించేవ‌ర‌కు కింద‌కు దిగ‌బోమ‌ని హెచ్చ‌రిస్తున్నారు. 1997-2001 మ‌ధ్య రిటైర్ అయిన కార్మికుల పిల్ల‌ల‌కు ఉద్యోగాలు ఇవ్వాల‌ని వారు నీటి ట్యాంక్ పై నుంచే త‌మ డిమాండ్ వినిపిస్తున్నారు. స్థానిక‌ అధికారులు వారికి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే, గుర్తింపు సంఘం నాయ‌కులు వ‌చ్చి తమ డిమాండుపై హామీ ఇచ్చేవ‌ర‌కు దిగ‌బోమంటూ యువకులు ఆందోళ‌న తెలుపుతున్నారు.

  • Loading...

More Telugu News