: 17 నుంచి మూడు రోజుల పాటు భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్న అమెజాన్!


ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు సాగిస్తున్న ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, ఈ పండగ సీజనులో 17 నుంచి 20వ తేదీ వరకూ మరో మూడు రోజుల పాటు భారీ డిస్కౌంట్లతో కూడిన అమ్మకాలు సాగించనున్నట్టు ప్రకటించింది. ప్రత్యర్థి సంస్థ స్నాప్ డీల్ 'దీవాలీ అన్ బాక్స్'ను పొడిగిస్తున్నామని తెలిపిన నేపథ్యంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్'లో భాగంగా వినియోగదారులను ఆకట్టుకోవడంలో విజయవంతమైన సంస్థ, మరిన్ని ఆఫర్లను ఈ దఫా ప్రకటించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు, ఇయర్ ఫోన్, మైక్రో ఎస్డీ కార్డులు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై భారీ డిస్కౌంట్లతో కూడిన అమ్మకాలు కస్టమర్ల ముందుకు రానున్నాయని సంస్థ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News