: చంద్రబాబు సుదీర్ఘ అమెరికా పర్యటన ఖరారు.. వచ్చే నెల 12న ప్రయాణం


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సుదీర్ఘ విదేశీ పర్యటన ఖరారైంది. నవంబర్ 12వ తేదీ నుంచి 22 వరకూ ఆయన 11 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారని ప్రభుత్వం ప్రకటించింది. నవ్యాంధ్రకు పెట్టుబడులను తీసుకు రావడమే లక్ష్యంగా, ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులతో ప్రత్యేక సమావేశాలు జరపనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబుతో పాటు ఈ టూర్ కు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణలతో పాటు పలువురు అధికారులు కూడా వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతులు కేంద్రం నుంచి వచ్చినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News