: పాపకి డైపర్లు పంపాలంటూ కేంద్ర మంత్రికి ట్వీట్
రైల్లో ప్రయాణిస్తున్న వారు ఏదైనా సహాయం కోరితే వెంటనే స్పందిస్తూ అందరిచేత శెభాష్ అనిపించుకుంటున్నారు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు. తాజాగా, తన కూతురుతో కలసి రైల్లో వెళుతున్నానని... పాపకి డైపర్ కావాలంటూ ప్రభాకర్ ఝా అనే వ్యక్తి సురేష్ ప్రభుకు ట్విట్టర్ ద్వారా మెసేజ్ పెట్టాడు. అతని అవసరాన్ని గుర్తించిన రైల్వే శాఖ... వివరాలు పంపాలంటూ సదరు వ్యక్తిని కోరింది. అయితే, ప్రభాకర్ ఝా చేసిన పనిని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. కేంద్ర మంత్రి స్పందిస్తున్నారు కదా అని... ఇంత చనువుగా ట్వీట్లు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన పాపకి డైపర్లు కావాలంటూ రైల్వే అధికారులను రిక్వెస్ట్ చేయడంతో, వారు స్పందించి సహాయం చేశారు.