: 100 టీవీ చానళ్లకు రూ. 130 మాత్రమే: ట్రాయ్ కీలక నిర్ణయం


వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో, వినియోగదారుల నుంచి అధిక మొత్తాలను వసూలు చేయకుండా ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వంద చానళ్లను ప్రసారం చేసే సెట్ టాప్ బాక్స్ కు నెలకు రూ. 130 మాత్రమే వసూలు చేయాలని తేల్చి చెప్పింది. ఈ నిబంధన కింద కచ్చితంగా 100 చానళ్లను కస్టమర్లకు అందించాల్సిందేనని తెలిపింది. ఇంకా ఎక్కువ చానళ్లు కావాలని భావించే వారి కోసం పలు శ్లాబ్ లను ప్రకటిస్తూ, రూ. 25 చొప్పున అదనంగా చెల్లించి ఆ చానళ్లను తీసుకోవచ్చని పేర్కొంది. తమకు నచ్చిన చానళ్లను వీక్షించే సౌలభ్యాన్ని దగ్గర చేసేందుకే ఈ మార్పులు చేసినట్టు ట్రాయ్ అధికారి ఒకరు వివరించారు.

  • Loading...

More Telugu News