: విదేశీ రెజ్లర్లను చితకబాదిన గ్రేట్ ఖలీ.. అకాడమీని ధ్వంసం చేయడమే కారణం!
ప్రముఖ రెజ్లర్ దిలీప్ సింగ్ రాణా(గ్రేట్ ఖలీ) విదేశీ రెజ్లర్లపై విరుచుకుపడ్డాడు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదాడు. ఈ మొత్తం తతంగాన్ని మీడియా వీడియో తీయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. హరియాణాలోని గురుగ్రామ్‌లో తావుదేవీలాల్ స్టేడియంలో ఈనెల 8న రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ షో జరగాల్సి ఉంది. వివిధ దేశాలకు చెందిన రెజ్లర్లు ఇందులో పాల్గొనాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల నిర్వాహకులు ఈ షోను రద్దు చేశారు. దీంతో ఖలీని కలవాలని వచ్చిన విదేశీ రెజ్లర్లు తీవ్ర నిరాశ చెందారు. ఖలీని కలిసేందుకు కష్టపడి ఇంతదూరం వచ్చినా ఆయన కలవలేదన్న ఆగ్రహంతో జలంధర్‌లోని ఖలీ అకాడమీలోకి చొరబడి అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఖలీ వెంటనే అక్కడికి చేరుకుని దొరికిన రెజ్లర్లను దొరికినట్టు చితకబాదాడు.