: దివ్యాంగులు, మహిళలకు ఇకనుంచి నేరుగా షిర్డీ సాయి దర్శనం: సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్


దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ఏడాదిలోపు వయసున్న పిల్లలతో ఉన్న మహిళలు ఇక నుంచి నేరుగా షిర్డీ సాయినాథుని దర్శించుకోవచ్చు. ఈ మేరకు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్ పర్సన్ సురేశ్ హవారే తెలిపారు. సాయి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో వేచి చూసే వారికి ఇక నుంచి టీ, కాఫీ, పాలు, బిస్కెట్లు ఉచితంగా అందజేయాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్రలోని గ్రామాలు, శివారు ప్రాంతాల నుంచి రోగులను తరలించేందుకు 500 అంబులెన్సులను ట్రస్ట్ సిద్ధం చేస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News