: కాబోయే భర్తను సరదాగా ఓడించిన సమంత... స్పందించిన గుత్తా జ్వాల!
ప్రేమలో ప్రతిక్షణాన్ని సినీ నటి సమంత ఎంజాయ్ చేస్తోంది. నాగ చైతన్యతో వివాహం గురించి ప్రకటించిన తరువాత తొలిసారి సమంత సోషల్ మీడియాలో తమ ఇద్దరి ఫోటో ఒకటి షేర్ చేసింది. అంతే కాదు, ఆ ఫోటోలో నాగచైతన్య ఫోటోపై లూజర్ అని, తన ఫోటోపై విన్నర్ అని రాసుకుంది. అయితే ఈ ఫోటోలో లూజర్ ఠీవీగా నిల్చుని ఉండగా, విన్నర్ కిందపడిపోయి విజయానందం ఆస్వాదిస్తూ ఉండడం విశేషం. నాగచైతన్యతో కలిసి షటిల్ ఆడి నీరసించిపోయిన సమంత మ్యాచ్ లో తానే గెలిచానని తెలిపింది. అంతేకాదు ‘బూ హ హ హ హ.. ఇలాంటి సమయంలో పీవీ సింధు మాకు స్ఫూర్తి’ అని ట్విట్టర్ లో పేర్కొంది. ఈ ట్వీట్ కు బ్యాడ్మింటన్ డబుల్స్ మహిళా క్రీడాకారిణి గుత్తా జ్వాలా వెంటనే స్పందించింది. ‘హ హ హ.. గెలిచినందుకు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేసింది. దానికి సమంత జవాబిస్తూ, ‘నేను చీట్ చేశాను’ అంటూ ఆటలో చైతన్య గెలిచినట్లు పరోక్షంగా వెల్లడించింది. ఎంతైనా సమంత మంచి ప్రియురాలని...తను చైని సరదాగా ఆటపట్టించిందని, ఇతరుల దగ్గర అతను గొప్ప అని చెప్పిందని నెటిజన్లు పేర్కొంటున్నారు.