: చంద్రబాబు చెప్పిన మాటతో జనాలు భయపడుతున్నారు: వైసీపీ నేత పార్థసారథి
అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం రాకెట్ లాంచర్ దాడులను కూడా తట్టుకుని నిలబడేలా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నారని... ఈ ప్రకటనతో ప్రజలు భయపడుతున్నారని వైసీపీ నేత పార్థసారథి ఎద్దేవా చేశారు. రాకెట్లను కూడా తట్టుకునేంత స్థాయిలో ఎందుకు నిర్మిస్తున్నారో చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సచివాలయానికి అదనపు హంగుల పేరుతో కమిషన్లను దండుకోవడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లపాటు ఉంటున్నప్పటికీ... తాత్కాలిక సచివాలయం పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.