: ఏపీలో ఎండోమెంట్ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి 60 ఏళ్లకు పెంపు


ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వయో పరిమితిని సడలిస్తూ, తయారు చేసిన ఫైల్ పై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవన ప్రమాణాలు పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆలయాల ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించామని అన్నారు. అన్ని దేవాలయాల ఆస్తులు, ఆదాయం భక్తులదేనని, భక్తులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపైనా, తన శాఖ అధికారులపైనా ఉందని అన్నారు. దివ్యదర్శనం పేరిట భక్తులు ఉచితంగా అన్ని ప్రముఖ ఆలయాలనూ దర్శించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News