: రష్యా ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు భేటీ
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విజయవాడలో రష్యా ప్రతినిధుల బృందంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు భేటీ అయ్యారు. రష్యా సమాఖ్య పరిశ్రమలు, వాణిజ్య మంత్రి జెనిష్ మ్యాంటురోవ్‌తో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీలో చంద్రబాబుతో పాటు రాష్ట్రమంత్రి యనమల రామకృష్ణుడు కూడా పాల్గొన్నారు. కాగా, మరికాసేపట్లో జేఎస్‌సీ, యూఎస్‌సీ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు మధ్య చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందంపై అధికారులు సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది.