: నా భార్య వల్లే ఆరెస్సెస్ వాళ్లు నిక్కర్లు వదిలి ప్యాంట్లు వేసుకుంటున్నారు: లాలూ


మొన్నటి వరకు ఆరెస్సెస్ లో కార్యకర్త దగ్గర నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరూ పరేడ్ సమయంలో తెల్ల చొక్కా, ఖాకీ నిక్కరు ధరించిన సంగతి తెలిసిందే. కానీ, దసరా నుంచి వారి సంప్రదాయం మారింది. ఖాకీ నిక్కరు వదిలి, ఖాకీ ప్యాంటు ధరిస్తున్నారు. దీనిపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. తన భార్య రబ్రీదేవి చెప్పడం వల్లే ఆరెస్సెస్ వాళ్లు ప్యాంట్లు ధరిస్తున్నారని ఎద్దేవా చేశారు. పట్టపగలు కూడా సిగ్గు లేకుండా ఆరెస్సెస్ వాళ్లు నిక్కర్లతో తిరుగుతున్నారంటూ తన భార్య వ్యాఖ్యానించిందని... అందుకే వాళ్లు నిక్కర్లు వదిలి ప్యాంట్లకు మారారని ట్వీట్ చేశారు. తనదైన శైలిలో కవితాత్మక ధోరణితో లాలూ ఈ విషయం చెప్పారు. "ఇప్పుడే సగం ప్యాంట్లను ఫుల్ చేయించుకున్నాం. మా బుర్రలను కూడా ఫుల్ చేసుకుంటాం. నిక్కర్లే కాదు ఆలోచనలు కూడా మార్చుకుంటాం. ఆయుధాలు పక్కన పెడతాం. విషాన్ని వ్యాపించనివ్వం", అంటూ ఆరెస్సెస్ ను ఉద్దేశించి సైటైరిక్ గా ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News