: తెలంగాణ‌కి కేంద్రం నుంచి తోడ్పాటు వ‌చ్చేలా ప్రయత్నిస్తా: కేంద్రమంత్రి ద‌త్త‌ాత్రేయ


హైద‌రాబాద్‌లోని ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రి బండారు ద‌త్తాత్రేయ నిర్వ‌హిస్తోన్న‌ అల‌య్ బ‌ల‌య్ కార్యక్ర‌మం కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా ద‌త్తాత్రేయ మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తాన‌ని అన్నారు. పేద‌వారికి విద్య, వైద్యం, ఉపాధి, బంగారు తెలంగాణ కోసం అన్ని వర్గాలు కృషి చేయాల‌ని, మ‌నుషుల‌ మ‌ధ్య ఏ భేదాలు ఉండ‌కూడ‌ద‌నే ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌తి పేద‌వాడికి మెరుగైన‌ విద్య, వైద్యం అందాలని ఆయ‌న అన్నారు. కేంద్రమంత్రిగా కొన‌సాగుతూ తెలంగాణ‌కు అండ‌గా ఉండి, స‌హ‌కారం అందిస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. హైదరాబాద్ ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దడానికి, బంగారు తెలంగాణ‌కి కేంద్రం నుంచి తోడ్పాటు వ‌చ్చేలా చూస్తానని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ నాయ‌క‌త్వంలో దేశం అభివృద్ధి దిశ‌గా సాగుతోందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News