: మానకొండూరులో పరిస్థితి ఉద్రిక్తం... పోలీసు స్టేషన్ ను ధ్వంసం చేసిన ఆందోళనకారులు


దసరా ఉత్సవాల్లో జరిగిన చిన్న గొడవ, పోలీసులకు కరీంనగర్ జిల్లా మానకొండూరు ప్రజల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడేలా చేసింది. గ్రామంలో ఊరేగింపు జరుగుతుండగా, యువకుల అత్యుత్సాహాన్ని అదుపు చేయాలని చూసిన కానిస్టేబుల్ ను ఐదుగురు దుర్భాషలాడారు. ఆపై వారిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తీసుకు వెళ్లి హెచ్చరించి పంపేయగా, మనస్తాపానికి గురైన శ్రావణ్ అనే యువకుడు, తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. శ్రావణ్ అంత్యక్రియల వేళ, సంయమనం కోల్పోయిన గ్రామస్థులు, స్టేషన్ పై దాడికి పాల్పడి ఫర్నీచర్ మొత్తాన్ని, సీసీ కెమెరాలను, పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. వారిని ఏమీ చేయలేక పోలీసులు చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించిన ఉన్నతాధికారులు, ఘటనపై విచారణ జరిపిస్తున్నామని, పోలీసుల తప్పుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News