: లక్షద్వీప్‌ సముద్ర ప్రాంతంలో భూకంపం


రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో లక్షద్వీప్ సముద్ర ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 4.01 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతున ఉందని, సునామీ భ‌యం లేద‌ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ అధికారులు పేర్కొన్నారు. దీని కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు జ‌రిగిన‌ట్లు సమాచారం లేదు. ప‌దేళ్ల క్రితం అక్క‌డ‌ సునామీ వ‌చ్చిన సంగ‌తి విదిత‌మే. అప్ప‌ట్లో అండ‌మాన్ నికోబార్ దీవుల్లో భారీ విధ్వంసం జ‌రిగింది.

  • Loading...

More Telugu News