: మధ్యప్రదేశ్ లో బస్సు బోల్తా...39 మందికి గాయాలు


మధ్యప్రదేశ్‌ లో బస్సు బోల్తా పడింది. భోపాల్‌ నుంచి బాలాఘాట్‌ కి వెళ్తున్న బస్సు జిర్పా గ్రామంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 39 మంది పోలీసులు గాయపడ్డారు. వీరంతా వీఐపీ డ్యూటీ విధుల కోసం బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన 39 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News