: దేవుడు కలలో కనిపించి గొయ్యి తవ్వమని చెప్పాడట.. అందుకని అలా తవ్వుతూనే వున్నాడు!
దేవుడు కలలో కనిపించి గొయ్యి తవ్వమన్నాడని ఓ వ్యక్తి గత 18 ఏళ్లుగా గొయ్యి తవ్వుతున్న ఘటన సాల్వడార్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ సాల్వడార్ కు చెందిన సాంటియాగో సాంచెజ్ (60) గత 18 ఏళ్లుగా గొయ్యి తవ్వుతూనే ఉన్నాడు. ఇలా సుమారు 3,087 అడుగుల గొయ్యి తవ్వేశాడు. ఇంత గొయ్యి ఎందుకు తవ్వుతున్నావని అడిగితే, దేవుడు తన కలలో కనిపించి, ఇక్కడ గొయ్యి తవ్వుతూ ఉండు అని చెప్పాడని చెబుతున్నాడు. అంతేకాదు, తాను చెప్పేంతవరకు గొయ్యి తవ్వడం అపవద్దు అని కూడా చెప్పాడట. దీంతో దేవుడు గొయ్యి ఆపమని చెప్పేంతవరకు తవ్వడం ఆపే ప్రసక్తి లేదని ఆయన చెబుతున్నాడు.