: అదనపు సంపాదన ఆశతో... చివరికి కిడ్నాపయ్యాడు!


అదనపు సంపాదన కోసం మేల్ ఎస్కార్ట్ అవ్వాలనుకున్న ఓ చిరుద్యోగి కిడ్నాపై పోలీసుల సాయంతో బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.... ఢిల్లీకి చెందిన సోహాల్ హష్మీ చిరు ఉద్యోగి. జీతం సరిపోకపోవడంతో అదనపు సంపాదన కోసం మోడల్‌ గా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ పేపర్ లో 'మేల్ ఎస్కార్ట్ కావలెను' అనే ప్రకటన చూశాడు. వెంటనే వారికి ఫోన్ చేసి తాను మేల్ ఎస్కార్ట్ గా పని చేస్తానని తెలిపాడు. దీంతో అతనిని ట్రాప్ చేసిన ముఠా, అతనిని బస్టాండ్‌ కు రప్పించి కిడ్నాప్ చేసింది. అనంతరం అతనిని మారుమూల ప్రాంతంలో బంధించి, సోహాల్ ఇంటికి ఫోన్ చేసి పది లక్షలు ఇస్తే అతనిని వదిలేస్తామని బేరం ప్రారంభించారు. దీంతో ఆందోళనకు గురైన సోహాల్ తల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతని ఫోన్ సంభాషణల డేటా సేకరించిన పోలీసులకు అసలు విషయం అర్థమైంది. దీంతో కిడ్నాపర్ల ఫోన్ కాల్స్ ట్రేస్ చేసి, అతనిని రక్షించి, కిడ్నాపర్ల ముఠాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రణాళిక సూత్రధారిని అరెస్టు చేసేందుకు గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News