: రాంలీలా మైదాన్ లో ఘనంగా రావణ దహనం


దేశవ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో రావణ దహనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్వహించిన రాంలీలా ఉత్సవ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన రావణ దహనాన్ని ఆయన తిలకించారు. అలాగే బీహార్‌ రాజధాని పట్నాలో రామ్‌ లీలా వేడుకను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులు ఘనంగా నిర్వహించారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రావణ దహనం కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రావణాసురుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడు దిష్టిబొమ్మలను తగులబెట్టారు.

  • Loading...

More Telugu News