: జెయింట్ వీల్ వద్ద సెల్ఫీ పిచ్చి... కుదుళ్లతో ఊడి వచ్చిన యువతి జుట్టు
సెల్ఫీ మోజులో యువత ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారన్న వార్తలు నిత్యం వార్తా పత్రికల్లో చూస్తున్నా, ఎవరిలోనూ ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని భాగపత్ జిల్లాలో జరిగిన మేళాలో ఒక యువతి పాల్గొంది. ఈ సందర్భంగా జెయింట్ వీల్ దగ్గర సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె జుట్టు జెయింట్ వీల్ గేర్లలో చిక్కుకుంది. దీంతో జెయింట్ వీల్ ను ఠక్కున ఆపే అవకాశం లేకపోవడంతో ఆమె విలవిల్లాడుతుండగా జుట్టంతా కుదుళ్లతో ఊడి వచ్చేసింది. దీంతో బాధ భరించలేకపోయిన ఆమె హాహాకారాలు చేసింది. వెంటనే జెయింట్ వీల్ ను ఆపేసి, స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.