: 27 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ఫాంలో కొనసాగుతున్నాడు. కెరీర్ లో పీక్ ఫాంలో ఉన్న అశ్విన్ కేవలం 38 టెస్టుల్లో పది వికెట్ల ఫీట్ ను ఆరు సార్లు నమోదు చేయడం విశేషం. దీంతో పాటు ఇప్పటివరకు 5 వికెట్ల ఫీట్ ను 20 టెస్టుల్లో సాధించిన బౌలర్ గా నిలిచాడు. దీంతో టీమిండియాకు అశ్విన్ ఎంత కీలక బౌలర్ గా ఎదిగాడన్నది ఈ గణాంకాలు చూస్తే తెలిసిపోతుంది. కివీస్ తో జరిగిన టెస్టు సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయడం వెనుక అశ్విన్ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. రెండు సార్లు పది వికెట్ల ఘనత సాధించిన అశ్విన్ ఈ సిరీస్ ను ఒంటిచేత్తో భారత్ కు అందించాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు నేలకూల్చాడు. దీంతో అశ్విన్ ఈ సిరీస్ లో మొత్తం 27 వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలవడం విశేషం.