: బాలీవుడ్ 'డిస్కో డాన్సర్' మిథున్ చక్రవర్తికి అస్వస్థత
ప్రముఖ బాలీవుడ్ నటుడు, 'డిస్కో డాన్సర్' ఫేం మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. 2009లో ‘లక్’ సినిమా షూటింగులో హెలికాప్టర్ నుంచి కిందకి దూకాల్సిన సన్నివేశంలో ఆయన పొరపాటున నేలపై పడ్డారు. అప్పుడు ఆయన కాలికి తీవ్ర గాయం అయింది. దీనికి చికిత్స తీసుకోవడంతో తగ్గిపోయింది. అయితే ఈ మధ్యే ఇది మళ్లీ తిరగబెట్టింది. దీంతో ఆయన అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన మేనేజర్ విజయ్ వెల్లడించారు. మరో నెల తరువాత ఆయన ముంబై చేరుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.