: నాకు మాటలు కూడా రావడం లేదు: హరీష్ రావు


ముఖ్యమంత్రి కేసీఆర్ రాకతో సిద్ధిపేట పులకించిపోతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాగా అవతరించడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని... నోట మాట కూడా రావడం లేదని తెలిపారు. కేసీఆర్ చేతుల మీదుగా జిల్లాను ప్రారంభింపజేయడం ఆనందంగా ఉందని చెప్పారు. సిద్ధిపేట అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర మరువలేనిదని చెప్పారు. ఏ జిల్లా ఏర్పాటు కోసమైతే 1983లో పిటిషన్ ఇచ్చారో... అదే జిల్లా ఏర్పాటు కోసం జీవోపై కేసీఆర్ సంతకం చేశారని కొనియాడారు. తెలంగాణ, సిద్ధిపేట చరిత్రలో కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. జిల్లా ప్రారంభోత్సవం పూర్తయిన తర్వాత సిద్ధిపేటవాసులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, హరీష్ ఈ విధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News