: అంబరాన్నంటిన సంబురం... సిద్ధిపేట జిల్లాను ప్రారంభించిన కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల సంబురం అంబరాన్ని తాకింది. కొత్తగా ఏర్పాటు చేసిన 21 జిల్లాలను విజయదశమి రోజున ధనుర్ లగ్నంలో 11.13 గంటలకు అట్టహాసంగా ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నిర్ణీత సమయానికి సిద్ధిపేట కలెక్టర్ భవనానికి చేరుకున్న కేసీఆర్ తొలుత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత, కేసీఆర్, హరీష్ రావులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత, కొత్త జిల్లా శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం, హారతి ఇచ్చి, బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి, దాన్ని పగలగొట్టి, రిబ్బన్ కట్ చేసి కలెక్టరేట్ భవంనంలోకి ప్రవేశించారు.

  • Loading...

More Telugu News