: కేటీఆర్ సలహాను అంగీకరించిన రానా!


తెలంగాణ మంత్రి కేటీఆర్.. సినీ హీరో రానా మధ్య ట్విట్టర్ లో సాగిన సంభాషణ ఆసక్తిదాయకంగా ఉంది. రానా తన తండ్రి, నిర్మాత సురేష్ బాబుతో ఒక సెల్ఫీ దిగి, దానిని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘ఈ నిర్మాతతో తొలిసారి పనిచేస్తున్నా.. ఆయనే నాన్న. శుభం జరగాలని మమ్మల్ని విష్ చేయండి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు త్వరలో చెబుతాను’ అని ట్వీట్ చేశాడు. ఇక, ఈ ట్వీట్ కు స్పందించిన కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘నాదో చిన్న సలహా/హెచ్చరిక. తండ్రులు చాలా టఫ్ బాస్ లుగా ఉంటారు/ ఉండొచ్చు. ఏమాత్రం ఏమరపాటుగా ఉండొద్దు’ అని కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ సలహా/హెచ్చరిక కు స్పందించిన రానా.. ‘ధ్యాంక్యూ సార్!! అంగీకరించా. అర్థం చేసుకుని అనుసరిస్తా’ అని జవాబిచ్చాడు. కాగా, ‘లీడర్’ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసిన దగ్గుబాటి రానాకు ‘బాహుబలి’ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ద్వారా మంచి ప్రశంసలు పొందాడు. ‘బాహుబలి-2’ కోసం భారీగా ఎక్సర్ సైజ్ చేసి, తన బాడీతో ఆశ్చర్యపరుస్తున్న రానా ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News