: మహేష్ బాబు హీరోగా చేయాల్సిన సినిమా... కృష్ణగారి దయతో నాకొచ్చింది: అలీ


హాస్యనటుడు, పలు చిత్రాల్లో హీరోగా చేసి పేరు తెచ్చుకున్న అలీ, తన పుట్టిన రోజు వేళ ఓ ఆసక్తికర అంశాన్ని గుర్తు చేసుకున్నాడు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, తన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'యమలీల' చిత్రంలో హీరోగా మహేశ్ బాబు చేయాల్సి వుందని అన్నాడు. అప్పట్లో దర్శకుడు కృష్ణారెడ్డి, యమలీల కథను సూపర్ స్టార్ కృష్ణకు చెప్పి, మహేశ్ తో ఈ చిత్రాన్ని తీస్తానని కోరితే, అందుకు ఆయన కనీసం రెండేళ్లు ఆగమని సలహా ఇచ్చారట. దీంతో అప్పటికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న కృష్ణారెడ్డి, ఆపై తనను ఓ డాన్సు ఫంక్షన్లో చూసి, హీరోను చేశారని అలీ చెప్పుకొచ్చాడు. ఆ చిత్రంలో పనిచేసినందుకు తనకు రూ. 50 వేలు ఇచ్చారని చెప్పారు. ఇండస్ట్రీలో పనిచేస్తున్నందుకు ఇప్పుడంతా వైట్ మనీయే ఇస్తున్నారని, వాటిల్లోనూ బౌన్స్ అయినవి ఉన్నాయని, తన వద్ద 15 వరకూ చెల్లని చెక్కులు ఉన్నాయని అలీ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News