: కొత్త జిల్లాల ఏర్పాటులో సర్కారు తీరుని గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకువెళతాం: రేవంత్‌రెడ్డి
రేపటి నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ప్రారంభించాలని తెలంగాణ సర్కారు ఓ వైపు అన్నింటినీ సిద్ధం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రతిపక్ష పార్టీల విమర్శలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అంశంపై టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంలో తెలంగాణ సర్కారు తీరుని తాము గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకువెళతామని ఆయన చెప్పారు. సర్కారు తీరు దళిత, గిరిజన నేతల్ని ఎదగనివ్వకుండా ఉందని ఆయన అన్నారు.