: సమాచారమడిగిన ప్రయాణికుడిపై పెన్నుతో దాడి చేసిన రైల్వే ఉద్యోగి


సమాచారమడిగిన ప్రయాణికుడిపై రైల్వే ఉద్యోగి పెన్నుతో దాడి చేసిన సంఘటన బెంగళూరులో జరిగింది. మైసూరులో జరిగే దేవీ నవరాత్రుళ్ల వేడుకలను చూడాలనే ఉద్దేశంతో వి.నారాయణ స్వామి (52), తన కుటుంబంతో కలిసి బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ కు వెళ్లారు. మైసూరు వెళ్లే ట్రెయిన్ సమయం, ఏ ప్లాట్ ఫామ్ పైకి వస్తుందనే సమాచారం అడిగేందుకు విచారణ కౌంటర్ వద్దకు వెళ్లాడు. అయితే, రైల్వే ఉద్యోగి సుబ్బయ్య సమాచారం చెప్పకపోగా, నారాయణ స్వామిపై మండిపడ్డాడు.. దుర్భాషలాడాడు. అంతేకాకుండా, కౌంటర్ లోని నారాయణ స్వామి చేతిపై సదరు ఉద్యోగి తన పెన్నుతో పొడిచి మరీ ఆ చేతిని బయటకు నెట్టేశాడు. ఈ సంఘటనతో నిర్ఘాంతపోయిన నారాయణ స్వామి రైల్వే పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News