: చెల‌రేగిన అశ్విన్.. ఒక్క‌ప‌రుగు కూడా చేయ‌కుండా వెనుదిరిగిన టైల‌ర్, రోచి.. క్రీజులో పాతుకుపోయిన గుప్తిల్ అవుట్


న్యూజిలాండ్, భారత్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదిక‌గా జ‌రుగుతున్న‌ మూడో టెస్టు మ్యాచు తొలి ఇన్సింగ్స్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్ ధాటికి ఆ జ‌ట్టు ఓపెన‌ర్ లాథ‌మ్ (53) వెనుదిరిగిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన కానే విలియ‌మ్‌స‌న్ 8 ప‌రుగుల‌కే అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంత‌రం మైదానంలో అడుగుపెట్టిన టైల‌ర్, రోచిల‌ను ఒక్క ప‌రుగు కూడా చేయ‌నివ్వ‌కుండా అశ్విన్ వెనుదిరిగేలా చేశాడు. క్రీజులో పాతుకుపోయిన గుప్తిల్ (72) కూడా అశ్విన్ బౌలింగ్‌లో ర‌న్ అవుట్ అయ్యాడు. 44 ప‌రుగులిచ్చిన అశ్విన్ ఖాతాలో నాలుగు వికెట్లు పడ్డాయి. న్యూజిలాండ్‌ ప్ర‌స్తుత స్కోరు 156/5 గా ఉంది. ప్రస్తుతం క్రీజులో నీషం (4), వాట్లింగ్(4) ఉన్నారు.

  • Loading...

More Telugu News