: హిజ్రాలు కనిపిస్తే తల నరికేస్తాం... పాకిస్తాన్ లో సంచలన పోస్టర్లు
పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో వివాదాస్పద పోస్టర్లు వెలిశాయి. హిజ్రాలు కనిపిస్తే తల నరికేయాలంటూ ఉన్న ఈ పోస్టర్లు అక్కడి షాపింగ్ మాల్స్ లో అధిక సంఖ్యలో అంటించి ఉండటం కలకలం రేపుతోంది. ఈ షాపింగ్ మాల్స్ ఉన్న ప్రాంతంలో భిక్షాటన నిమిత్తం హిజ్రాలు ఇక్కడ తిరుగుతుంటారు. ఈ పోస్టర్లు వెలిసిన నేపథ్యంలో వారిపై ఎటువంటి దాడులు జరగకుండా ఉండేందుకు పోలీసులను అప్రమత్తం చేశామని పోలీసు శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. హిజ్రాలు తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని భావిస్తే కనుక తమను రక్షణ కోరవచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, హిజ్రాలు తమ వ్యాపారాలకు అడ్డు తగులుతున్నారని, డబ్బులివ్వనిదే వదిలిపెట్టడం లేదని వ్యాపారులు విమర్శిస్తున్నారు.